మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం

మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం

ఎవరాపినా ఉత్తరప్రదేశ్ అభివృద్ధి ఆగబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. SP, BSPల పాలన రానివ్వకూడదని ఉత్తరప్రదేశ్ మహిళలు నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.  మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని... అందులో భాగంగానే పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచామన్నారు. ఉత్తరప్రదేశ్ లో 30 లక్షల ఇళ్లు నిర్మిస్తే... 25 లక్ష ఇళ్లను మహిళల పేరుతోనే రిజిస్టర్ చేసినట్టు తెలిపారు. అనేక తరాలుగా ఇక్కడి మహిళలకు ఎలాంటి ఆస్తులు లేవని... ఇప్పుడు ఇల్లే వారి పేరుతో ఉందని మోడీ అన్నారు.  ప్రయాగ్ రాజ్ లో పర్యటించిన మోడీ... ముఖ్యమంత్రి కన్యా సుమంగళ స్కీమ్ కింద స్వయం సహాయక గ్రూపులకు చెందిన లక్ష మంది మహిళల ఖాతాల్లోకి వెయ్యి కోట్లు ట్రాన్స్ ఫర్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

For More News..

కేసీఆర్ కు కోమటిరెడ్డి హెచ్చరిక

కౌలు చెల్లించలేక.. అప్పులు తీర్చలేక రైతు సూసైడ్

క్యారీ బ్యాగులకు డబ్బులు వసూలు చేస్తే ఫైన్ తప్పదు