
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో టెన్షన్ల నేపథ్యంలో.. మన సోల్జర్లకు చైనా అధికారిక భాష మాండరిన్లో శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. చైనాతో భారత్ 3,400 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నది. ఎల్ఏసీ వెంట నిఘా మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సోల్జర్లకు చైనీస్ భాష నేర్పాలని భావిస్తోంది. చైనా సైనికులతో చర్చలు జరిపేందుకు వీలుగా జూనియర్, సీనియర్ ఇండియన్ మిలిటరీ కమాండర్లకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. మాండరిన్ భాష నేర్చుకోవడంతో అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కార్పస్ కమాండర్ లెవల్ మీటింగ్, ఫ్లాగ్ మీటింగ్స్, బార్డర్ పర్సనల్ మీటింగ్స్ చైనా వర్షన్ ఈజీగా అర్థం చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. ఉత్తర, తూర్పు, మధ్య కమాండ్ లాంగ్వేజ్ స్కూల్స్‌లో కొన్ని మాండరిన్ భాషా కోర్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆ లాంగ్వేజ్‌లోని స్క్రిప్ట్స్, లిటరేచర్ ట్రాన్స్లేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను ఇప్పటికే ఉపయోగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.