శ్రద్ధ వాకర్​ కేసులో సంచలన విషయాలు

శ్రద్ధ వాకర్​ కేసులో సంచలన విషయాలు
  • నోరు నొక్కి.. చెస్ట్​పై కూర్చొని పీక కోశానన్న హంతకుడు
  • నిందితుడి​ ముఖంలో పశ్చాత్తాపం కనిపించలేదన్న ఢిల్లీ పోలీసులు
  • ఫ్రిజ్​లో పెట్టిన శ్రద్ధ ముఖాన్ని రోజూ చూసేవాడని వెల్లడి
  • ఎలా తప్పించుకోవాలో గూగుల్​లో వెతికిండు
  • రూమ్​ను రసాయనాలతో కడిగిండన్న అధికారులు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్​ హత్య కేసులో దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి. శ్రద్ధను చంపేసిన వివరాలను అఫ్తాబ్​ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలు చెబుతున్నపుడు కానీ ఆ తర్వాత కానీ అఫ్తాబ్​ ముఖంలో పశ్చాత్తాపం కనిపించలేదని వివరించారు. తనకు హిందీ రాదంటూ.. మర్డర్​ చేసిన తీరును ఇంగ్లీష్​లోనే చెప్పాడన్నారు. విచారణలో శ్రద్ధను తనే చంపినట్లు అఫ్తాబ్  అంగీకరించాడు. మే 18న శ్రద్ధను కిందపడేసి, నోరు నొక్కి చెస్ట్​పై కూర్చొని గొంతుకోశానని వెల్లడించాడు. ఆ తర్వాత డెడ్​ బాడీని బాత్​రూమ్​లోకి తీసుకెళ్లి దాచాడని పోలీసులు చెప్పారు. డెడ్​ బాడీని ఎలా మాయం చేయాలని గూగుల్​లో వెతికాడని వివరించారు. డీఎన్​ఏ శాంపిల్స్ దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని, బెడ్​ రూమ్​లో పడిన రక్తపు మరకలను తొలగించేందుకు రసాయనాలను ఉపయోగించి శుభ్రం చేశాడని పేర్కొన్నారు. అపార్ట్​మెంట్​దగ్గర్లోని షాప్​ నుంచి ఫ్రిజ్, రంపం, గార్బేజ్​ బ్యాగులు కొన్నాడని పోలీసులు వివరించారు.

అఫ్తాబ్​ను ఉరి తీయాలి : శ్రద్ధ తండ్రి

లవ్‌‌‌‌‌‌‌‌ జిహాద్ పేరుతో నా కూతురిని హింసించి చంపిన అఫ్తాబ్​ ను ఉరితీయాలని శ్రద్ధ తండ్రి డిమాండ్​ చేశారు. ఢిల్లీ పోలీసులపై తనకు నమ్మకం ఉందన్నారు. నిందితుడికి శిక్ష పడేలా చూస్తారని ఆశిస్తున్నట్లు వివరించారు. అఫ్తాబ్​తో బంధం వద్దన్నందుకు శ్రద్ధ తనతో ఎక్కువ మాట్లేడేదికాదని శ్రద్ధ తండ్రి వికాస్​ వాకర్​ కన్నీటి పర్యంతమయ్యాడు. ముంబైలో ఉన్నప్పుడు అఫ్తాబ్ తనను కొడుతున్నాడని శ్రద్ధ తనతో చెప్పుకుని ఏడ్చిందని ఆమె దోస్తు చెప్పింది. ఈ కేసును లవ్​ జిహాద్​ కోణంలో దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులకు ముంబై ఎమ్మెల్యే రాంకదమ్​ లెటర్​ రాశారు.

పరారీలో అఫ్తాబ్​ ఫ్యామిలీ

ముంబై సమీపంలోని వసాయ్​లో 20 ఏండ్లుగా ఉంటున్న అఫ్తాబ్​ ఫ్యామిలీ సుమారు 15 రోజుల క్రితమే ఫ్లాట్​ ఖాళీచేసి వెళ్లిపోయింది. వాళ్లు ఫ్లాట్​ ఖాళీ చేసే సమయంలో అఫ్తాబ్​ కూడా అక్కడే ఉన్నాడని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. ఆ సమయంలో అఫ్తాబ్ నార్మల్​ గానే కనిపించాడని, ఎలాంటి కంగారు కానీ, భయాందోళన కానీ మనిషిలో కనిపించలేదని స్పష్టం చేశారు. దీంతో ప్లాన్​ ప్రకారమే వారిని అఫ్తాబ్​ తరలించాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అఫ్తాబ్ ఇంటికి తరచుగా శ్రద్ధ కూడా వస్తుండేదని, అఫ్తాబ్​ ఇక్కడే పుట్టి పెరిగాడని పక్కింటి వాళ్లు చెప్పారు. ఎందుకు ఖాళీ చేస్తున్నారని అడిగితే.. చిన్న కొడుకుకు ముంబైలో ఉద్యోగం రావడంతో అందరమూ అక్కడికే షిఫ్ట్ 
అవుతున్నట్లు చెప్పారన్నారు.

మెహ్రౌలీ పోలిస్​ స్టేషన్​లో నిందితుడు

సౌత్‌‌‌‌‌‌‌‌ ఢిల్లీలోని మెహ్రౌలీ స్టేషన్​లో అఫ్తాబ్​ను పోలీసులు విచారిస్తున్నారు. అఫ్తాబ్​ హిస్టరీ ఇవ్వాల్సిందిగా డేటింగ్ యాప్​ ఆఫీస్​కు లేఖ రాశారు. సీబీఐ ఫోరెన్సిక్​ టీమ్ నిందితుడు అఫ్తాబ్​ను మంగళవారం మెహ్రౌలీ ఫారెస్ట్​ ఏరియాకు తీసుకెళ్లారు. అక్కడ వెతకగా 13 శరీర భాగాలు​ దొరికాయి. వాటిని ఫోరెన్సిక్​ పరీక్షకు పంపించారు. అయితే మర్డర్​కు ఉపయోగించిన కత్తి ఇంకా దొరకలేదు. ‘‘అఫ్తాబ్ ఎవరితో మాట్లాడేవాడు కాదు. వాళ్ల ఫ్లాట్​లో తరచూ పార్టీలు జరిగేవి. 2-3వారాల కింద కూడా చాలా మంది అమ్మాయిలు వచ్చారు”అని పక్కింటోళ్లు పోలీసులకు చెప్పారు. 

గార్బేజ్​ వ్యాన్​లో శ్రద్ధ బట్టలు..

రక్తంతో తడిసిన శ్రద్ధ బట్టలను అఫ్తాబ్​ గార్బేజ్​ వ్యాన్​లో పడేశాడని పోలీసులు చెప్పారు. రంపంతో డెడ్​బాడీని ముక్కలుగా నరికి ఫ్రిజ్​లో పెట్టాడన్నారు. ప్రతిరోజూ ఫ్రిజ్​ తెరిచి శ్రద్ధ ముఖాన్ని చూసుకునే వాడని, అదే ఫ్రిజ్​లో తను తినే తిండి కూడా పెట్టేవాడని తెలిపారు. హత్య చేసిన రూమ్​లోనే రోజూ పడుకున్నాడని వివరించారు. శ్రద్ధను చంపేసిన పది పదిహేను రోజుల్లోనే డేటింగ్​ యాప్​లో మరో అమ్మాయితో అఫ్తాబ్​ పరిచయం పెంచుకుని, ఫ్లాట్​కు తెచ్చుకున్నాడని పేర్కొన్నారు. అనుమానం రాకుండా శ్రద్ధ ఇన్​స్టాను అఫ్తాబ్​ కొన్ని రోజులు మెయింటెన్​ చేశాడు. ముంబై వెళ్లి శ్రద్ధ ఫోన్​ను పడేశాడు.