స్టోక్స్‌‌‌‌‌‌‌‌ వణికించినా..రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్​ విక్టరీ

స్టోక్స్‌‌‌‌‌‌‌‌ వణికించినా..రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్​ విక్టరీ

లండన్‌‌‌‌‌‌‌‌ : ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (214 బాల్స్​లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 155) అద్భుత సెంచరీతో పోరాడినా.. లార్డ్స్​ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. యాషెస్​ సిరీస్​లో భాగంగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్‌‌‌‌‌‌‌‌ 43 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో 2–0 ఆధిక్యంలోకి వచ్చింది. 371 రన్స్​ టార్గెట్​ ఛేజింగ్​లో  114/4 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 81.3 ఓవర్లలో 327 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. బెన్‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌ (83), స్టోక్స్‌‌‌‌‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 132 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి హోమ్​టీమ్​ను రేసులోకి తెచ్చారు.  

కానీ బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో (10) వివాదాస్పదంగా ఔట్‌‌‌‌‌‌‌‌ కావడం ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీసింది. అయినా పోరాటం ఆపని స్టోక్స్​ భారీ సిక్సర్లు కొడుతూ  బ్రాడ్‌‌‌‌‌‌‌‌ (11)తో ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 108 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఆస్ట్రేలియాను వణికించాడు. కానీ, హేజిల్​వుడ్​ బౌలింగ్​లో మరో షాట్​కు ట్రై చేసి కీపర్​కు క్యాచ్​  ఇవ్వడంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఆశలు వదిలేసుకుంది. జోష్‌‌‌‌‌‌‌‌ టంగ్‌‌‌‌‌‌‌‌ (19), రాబిన్సన్‌‌‌‌‌‌‌‌ (1) నిరాశపర్చారు. స్టార్క్‌‌‌‌‌‌‌‌, కమిన్స్‌‌‌‌‌‌‌‌, హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ తలా మూడు వికెట్లు తీశారు. స్మిత్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.6 నుంచి లీడ్స్​లో మూడో టెస్టు జరుగుతుంది.

బెయిర్​స్టో ఔట్​పై రగడ

ఈ మ్యాచ్​లో బెయిర్​స్టో స్టంపౌట్​ వివాదాస్పదమైంది. ఆసీస్​ పేసర్​ గ్రీన్‌‌‌‌‌‌‌‌ వేసిన లో బౌన్సర్​ను వదిలేసిన బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో.. అవతలి వైపు ఉన్న స్టోక్స్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడేందుకు క్రీజును వదిలాడు. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో బాల్‌‌‌‌‌‌‌‌ అందుకున్న కీపర్‌‌‌‌‌‌‌‌ క్యారీ నేరుగా వికెట్ల పైకి విసిరాడు. రీప్లే చూసిన  తర్వాత థర్డ్​ అంపైర్​ బెయిర్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌ను స్టంపౌట్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించడంతో కాసేపు గందరగోళం నెలకొంది. దీనిపై స్టేడియంలోని ఇంగ్లండ్ ఫ్యాన్స్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అదే ఆస్ట్రేలియా.. అదే చీటింగ్​’ అంటూ  ఫ్యాన్స్​ నినాదాలు చేశారు.