
క్రిష్ సిద్దిపల్లి, కష్వీ జంటగా వాల్మీకి దర్శకత్వంలో సన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘జంధ్యాల గారి జాతర 2.0’. శుక్రవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. జంధ్యాల గారి పేరుతో రూపొందుతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ కచ్చితంగా అందరి అంచనాలను అందుకునేలా ఉంటుందని దర్శకుడు వాల్మీకి చెప్పారు.
నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వి మాట్లాడుతూ ‘టైటిల్ చూడగానే అద్భుతంగా అనిపించింది. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా’ అన్నారు. టైటిల్ చాలా బాగుందని సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆనందింప చేస్తుందని నటుడు రఘుబాబు అన్నారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, సత్య, అజయ్ ఘోష్, రాజీవ్ కనకాల, రఘుబాబు, ప్రిన్స్, నాగినీడు, పవిత్ర నరేష్, పూర్ణ, సురేఖ వాణి, దువ్వాసి మోహన్, శ్రీలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.