ఫస్ట్ వన్డేలో భారత మహిళా జట్టు గ్రాండ్ విక్టరీ

ఫస్ట్ వన్డేలో భారత మహిళా జట్టు గ్రాండ్ విక్టరీ

హోవ్ (ఇంగ్లండ్): ఇవాళ జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్ జట్టును చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల కోల్పోయి 227 పరుగులు సాధించింది. ఇక 228 రన్స్ టార్గెట్ తో క్రీజ్ లోకి వచ్చిన భారత్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

228 పరుగుల లక్ష్యంతో దిగిన భారత జట్టులో 99 పరుగుల సాధించిన  స్టార్ ప్లేయర్ స్మ్రితి మందాన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. ఇంకా భారత్ తరపున హర్మాన్ ప్రీత్ కౌర్ (74 రన్స్), యాస్తిక భాటియా (54 రన్స్)తో బాధ్యతయతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకోగా, జులన్ గోస్వామి, మేఘ్నా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్ తలో వికెట్ తీశారు.

ఇక.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 227 రన్స్ చేసింది. అలైస్ డేవిడ్సన్ రిచర్డ్సన్ 50 పరుగులు చేయగా... డానీ వ్యాట్ 43, సోఫీ ఎక్స్లెస్టోన్ 31, సోఫియా డంక్లీ 29 పరుగులు చేశారు. మిగతా ఏ ఒక్క బ్యాటర్ కూడా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లండ్ బౌలింగ్ విషయానికొస్తే... కేట్ క్రాస్ 2 వికెట్లు, చార్లీ డీన్ ఒక వికెట్ తీశారు. ఇక 3 వన్డేల సిరీస్ లో ఈ విజయంతో భారత జట్టు లీడ్ లో కొనసాగుతోంది.