
హుజూర్ నగర్, వెలుగు: మండలంలోని అమరవరం పీఎసీఎస్ సర్వసభ్య సమావేశం చైర్మన్ అన్నెం శౌరి రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది. పీఎసీఎస్ పరిధిలోని అంజలిపురం డైరెక్టర్లు తమ గ్రామంలో పీఎసీఎస్ గోడౌన్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
అమరవరం డైరెక్టర్లు కొందరు వ్యతిరేకించడంతో స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని గోదాం నిర్మించేందుకు స్థల సేకరణ చేసి నిర్మాణం చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేయడంతో వివాదం సద్దుమణిగింది.