మూడో వన్డేలో కోహ్లీ150 పరుగులు

మూడో వన్డేలో  కోహ్లీ150 పరుగులు

కేరళలోని తిరువునంపురంలో శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో  విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నుంచి పరుగుల వరద పారుతోంది. స్పిన్,ఫాస్ట్ అనే తేడా లేకుండా లంక బౌలర్లపై కనికరం చూపించకుండా అందరినీ చితకబాదేస్తున్నాడు. 85 బంతుల్లో సెంచరీ చేసిన విరాట్.. తర్వాత అర్థశతకాన్ని 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. 110 బంతుల్లో విరాట్ 166పరుగుల మార్క్ ను చేరుకున్నాడు. అందులో 13 ఫోర్లు, 8 సిక్స్ లు ఉన్నాయి. కోహ్లీ బౌండరీ లైన్ కు బంతిని తరలించినప్పుడల్లా మైదానంలోని అభిమానులు కేరింతలు పెట్టారు.  విరాట్..విరాట్ అంటూ నినాదాలు చేశారు. 

బ్యాటింగ్ కు వచ్చినప్పటి నుంచి  లంక బౌలర్లపై ఎటాకింగ్ కు దిగాడు విరాట్ కోహ్లీ .85 బంతుల్లో సెంచరీ మార్క్ ను చేరుకున్నాడు. వన్డేల్లే కోహ్లీకి ఇది 46వ సెంచరీ కాగా..ఓవరాల్ గా 74  సెంచరీలు పూర్తి చేశాడు. శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేల జయవర్దనే రికార్డ్ ను కోహ్లీ బ్రేక్ చేశాడు.   సచిన్ స్వదేశంలో చేసిన 20 సెంచరీలను 160 మ్యాచ్ ల్లో పూర్తిచేస్తే, విరాట్ మాత్రం 101 మ్యచ్ ల్లోనే చేరుకున్నాడు.