ఆరంభం అదిరింది.. ఆసీస్పై భారత్​ అద్భుత విజయం

ఆరంభం అదిరింది.. ఆసీస్పై భారత్​ అద్భుత విజయం

వరల్డ్ కప్  మ్యాచుల్లో భారత్  జట్టు అద్భుత విజయం సాధించింది. చెన్నై  వేదికగా ఆదివారం (అక్టోబర్ 8న) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో భారత్​ విజయం సాధించింది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 199 పరుగుల లక్ష్య చేధనలో 4 వికెట్లు కోల్పోయి..  41.2 ఓవర్ లో లక్ష్యాన్ని ఛేదించింది 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 10వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేసింది. స్మిత్ (46), వార్నర్ (41 ) మిగతా బ్యాటమెన్స్ అంతగా రాణించ లేకపోయారు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకోగా.. కుల్దీప్ యాదవ్, బుమ్రా 2 వికెట్లు తీసుకున్నారు. ఇక సిరాజ్, అశ్విన్, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ తీసుకున్నారు.

అనంతరం 200 పరుగుల లక్ష్య చేధనలో టీం ఇండియాకు బిగ్ షాక్ లు తగిలాయి. రోహిత్ శర్మ (0), ఇషాన్ కిసాన్ (0), శ్రేయాస్ అయ్యర్ (0)  డక్ అవుట్ తో వెనుదిరిగారు. ఆ తరువాత కోహ్లీ, రాహుల్ మరో వికెట్ పడకుండా సింగిల్స్ తీస్తూ ఇనింగ్స్ ను  చక్కదిద్దారు. ఇద్దరు నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ (85) పరుగుల వద్ద అవుట్ అవ్వగా ... కేఏల్ రాహుల్ (97) , హార్దిక్ పాండ్యా (11)తో కలిసి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.  ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజలవుడ్ 3 వికెట్లు తీసుకోగా ,స్టార్క్ 1వికెట్ తీసుకున్నాడు. 

స్కోర్ వివరాలు

ఆస్ట్రేలియా: 199-10 (49.3 )...  టీం ఇండియా :201-4 (41.2)