
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు
- ఇల్లందు సింగరేణి కోయగూడెం గనిలో వరద నీరు
- ఇల్లందు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- ఇల్లందు సింగరేణిలో రోజు 15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి
- ఆరు మోటార్లతోనీటిని తోడేస్తున్న అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో గనిలోకి విపరీతంగా వరదనీరు చేరింది. దీంతో గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
ప్రతి రోజూసుమారు 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు పూర్తిగా ఆగిపోయాయి. గనిలో చేరిన నీటి కారణంగా ఉత్పత్తి పనులు పూర్తిగా స్థంభించిపోయాయి.
గనిలో చేరిన నీటిని బయటికి పంపే చర్యలు చేపట్టారు అధికారులు. ఇప్పటికే గనిచేరిన 6వందల గ్యాలన్ల వరద నీటిని 6 భారీ మోటార్ల సహాయంతో గనిలోంచి బయటికి పంపించారు.
►ALSO READ | జగిత్యాల జిల్లాలో చెరువు తెగుతుందనే టెన్షన్లో ప్రజలు.. డేంజర్ జోన్లో ఆ మూడు గ్రామాలు
గనిలో నీటిని బయటికి వెళ్లిన తర్వాత బొగ్గు ఉత్పత్తి తిరిగి ప్రారంభం అవుతుంది.. కాబట్టి ఈ ప్రక్రియ కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. వర్షాలు మరింత ఎక్కువ కురిస్తే పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.