అస్సాంలో కుండపోత వాన.. విరిగిపడ్డ కొండచరియలు

అస్సాంలో కుండపోత వాన.. విరిగిపడ్డ కొండచరియలు

అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా  దిమా అసావో జిల్లాలోని అఫ్లాంగ్ ఏరియాలోని రోడ్డు కొట్టుకు పోయింది. హోజాయ్, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాల్లోనూ పలు రహాదారులు జలమయం అయ్యాయి. దీంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

డిమా హసావో జిల్లాలోని 12గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.  హఫ్లాంగ్ ప్రాంతంలో  దాదాపు 80 ఇండ్లు పాక్షికంగా  దెబ్బతిన్నాయి. భారీ వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు హఫ్లాంగ్ ఏరియాలో ముగ్గురు చనిపోయినట్లు చెప్పారు డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు.