- కారులో తీసుకెళ్లి ముగ్గురు యువకుల లైంగిక దాడి
- గత నెల15న ఘటన..ఆలస్యంగా వెలుగులోకి..
వరంగల్, వెలుగు: వరంగల్ లో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వరం గల్ సిటీలోని బొల్లికుంట వాగ్దేవి కాలేజీలో విద్యార్థిని బీఫార్మసీ చదువుతూ.. కాలేజీకి దగ్గర్లోని ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటుంది. గత నెల15న ముగ్గురు యువకులు హాస్టల్ వద్దకు వెళ్లి ఆమెను నమ్మించి కారులో బయటకు తీసుకెళ్లారు. వరంగల్ సిటీలోనే ఓ హోటల్ ఓయో రూమ్ కు తీసుకెళ్లి ఆమెకు బలవంతంగా బీర్లు తాగించినట్టు, అనంతరం ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడినట్టు, ఇది ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్టు.. మంగళవారం బాధిత విద్యార్థిని ఇంతేజార్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా.. లైంగికదాడికి పాల్పడ్డ యువకులు అదే కాలేజీలో బీటెక్ చేస్తున్నట్టు.. భూపాలపల్లికి చెందినవారిగా తెలుస్తోంది.