పెట్రోల్​లో నీళ్లు కలిపి అమ్ముతున్నరు .. ఆగ్రహించిన వాహనదారులు 

పెట్రోల్​లో నీళ్లు కలిపి అమ్ముతున్నరు .. ఆగ్రహించిన వాహనదారులు 

పటాన్​చెరు, వెలుగు: పెట్రోల్​లో నీళ్లు కలిపి అమ్ముతున్న సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో జరిగింది.  శనివారం మండల పరిధిలోని కానుకుంటలో హర్ష పెట్రోల్​బంక్​లో పలువురు వాహనదారులు పెట్రోల్​ కొట్టించుకోగా అనుమానం వచ్చి బాటిళ్లలో పట్టి చూశారు. పెట్రోల్​ నీళ్లు కలిసినట్టు గుర్తించారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహనదారులు బంక్​ యాజమాన్యంతో గొడవకు దిగారు.

 ఘటనా స్థలానికి చేరుకున్న  పోలీసులకు వాహనదారులు పెట్రోల్​బాటిళ్లను చూపారు. వారు వెంటనే సివిల్​ సప్లై అధికారులకు సమాచారం అందించడంతో  అధికారులు విచారణ ప్రారంభించారు.