- ప్రకటించిన అదానీ గ్రూప్
న్యూఢిల్లీ : దేశంలోని రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ అదానీ గ్రూప్ బ్రౌన్‌ఫీల్డ్ విస్తరణపై దృష్టి సారించిందని, పెన్నా సిమెంట్ వంటి కొనుగోలు అవకాశాలు తమ 140 ఎంటీపీఏ లక్ష్య సామర్థ్యాన్ని చేరుకోవడంలో సహాయపడతాయని శుక్రవారం తెలిపింది. బిలియనీర్ గౌతమ్ అదానీ యాజమాన్యంలోని సంస్థ గురువారం హైదరాబాద్ ఆధారిత పెన్నా సిమెంట్‌ను రూ. 10,422 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో క్యాష్-ఆల్ డీల్‌లో కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇది దక్షిణ భారతదేశంలో తన ఉనికిని బలోపేతం చేస్తుందని ప్రకటించింది. అంబుజాను శ్రీలంకలోకి తిరిగి తీసుకువస్తామని అంబుజా సిమెంట్స్ సీఈఓ హోల్ టైమ్ డైరెక్టర్ అజయ్ కపూర్ ఒప్పందం తర్వాత శుక్రవారం జరిగిన ఇన్వెస్టర్ మీటింగ్ కాల్‌లో చెప్పారు. విస్తరణ కోసం ఇప్పటికే 40 ఎంటీపీఏల కోసం ప్లాన్లను తయారు చేశామని అజయ్ చెప్పారు. పెన్నా కెపాసిటీ 14 ఎంటీపీఏ వరకు ఉందని వివరించారు. తాము తప్పకుండా 140 ఎంటీపీఏ లక్ష్యాన్ని చేధిస్తామని స్పష్టం చేశారు. పెన్నా సిమెంట్‌తో దక్షిణాదిన పెద్ద ఎత్తున విస్తరిస్తామని అన్నారు.