- ఏడు సిటీల్లో 1.13 లక్షల ఇండ్ల అమ్మకం: ఎనరాక్ రిపోర్టు
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు టాప్ సిటీలలో జనవరి– మార్చి క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు 1.13 లక్షలకు చేరినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ ఎనరాక్ తన రిపోర్టులో వెల్లడించింది. ఇండ్ల రేట్లు 6 నుంచి 9 శాతం పెరిగినా, డిమాండ్ స్ట్రాంగ్‌గా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమని తెలిపింది. దేశ రియాల్టీ సెక్టార్లో రెసిడెన్షియల్ హౌసింగ్ సెగ్మెంట్లో బుల్ రన్ కంటిన్యూ అవుతోందని పేర్కొంది. గత పదేళ్ల కాలానికి చూస్తే ఒక క్వార్టర్లో ఇంత ఎక్కువ అమ్మకాలు ఎప్పుడూ రికార్డవలేదని ఎనరాక్ రిపోర్టు చెబుతోంది.
ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యలో ఇండ్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయని, అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో రెసిడెన్షియల్ హౌసింగ్ సేల్స్ 99,550 యూనిట్లేనని పేర్కొంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్–పుణెలు కలిపి మొత్తం అమ్మకాలలో 48 శాతాన్ని కంట్రిబ్యూట్ చేశాయి. ఈ కేలండర్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో ఢిల్లీ–ఎన్సీఆర్ ఒక్కటే సేల్స్‌లో తగ్గుదలను రికార్డు చేసింది.
షార్ట్ టర్మ్‌లో సవాళ్లుండొచ్చు..
షార్ట్టర్మ్లో హౌసింగ్ సెక్టార్‌కు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చని పురి హెచ్చరిస్తున్నారు. ఇన్ఫ్లేషన్ పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపుదల వంటివి ఈ సవాళ్లకు కారణమవుతాయని ఆయన వివరించారు. దీంతో రాబోయే రెండు క్వార్టర్లలో హౌసింగ్ మార్కెట్ డిమాండ్ కొంత తగ్గొచ్చని పురి పేర్కొన్నారు. ఎనరాక్ డేటా ప్రకారం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రెసిడెన్షియల్ హౌసింగ్ సేల్స్ ఈ ఏడాది మొదటి క్వార్టర్లో 19 శాతం పెరిగి 34,690 యూనిట్లకు చేరాయి. పుణెలో అమ్మకాలు ఏకంగా 42 శాతం ఎక్కువై 19,920 యూనిట్లయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో మాత్రం అమ్మకాలు 9 శాతం పడిపోయి 17,160 యూనిట్లకు పరిమితమయ్యాయి.
బెంగళూరులో రెసిడెన్షియల్ ప్రాపర్టీల సేల్స్ 16 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లోనూ రెసిడెన్షియల్ ఇండ్ల అమ్మకాలు 9 శాతం పెరిగి 14,280 యూనిట్లకు చేరాయి. చెన్నైలో అమ్మకాలు 18 శాతం, కోల్‌కతాలో 3 శాతం పెరిగాయి. ఏడు సిటీలలోనూ సగటున ఇండ్ల రేట్లు 6 నుంచి 9 శాతం పెరిగాయని ఎనరాక్ డేటా వెల్లడిస్తోంది. కన్స్ట్రక్షన్ రా మెటీరియల్స్ రేట్లు పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. దేశంలో రెసిడెన్షియల్ హౌసింగ్ డిమాండ్ పెరుగుదల రాబోయే కొన్నేళ్లలో కొనసాగుతోందని రియాల్టీ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ చెప్పారు.
రెసిడెన్షియల్ హౌసింగ్ డిమాండ్ పెరుగుదల కొనసాగుతోంది. మొదటి క్వార్టర్లో పదేళ్లలో మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ సేల్స్ రికార్డయ్యాయి. ముఖ్యంగా రూ. 1.5 కోట్లకు మించిన విలువున్న ఇండ్ల అమ్మకాల జోరు ఎక్కువైంది. - అనూజ్ పురి, ఎనరాక్ చైర్మన్
