
న్యూఢిల్లీ: హ్యాండ్ శానిటైజర్లు, డిజ్ఇన్ఫెక్టెంట్స్కు మళ్లీ డిమాండ్ పెరుగుతున్నట్లు ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటమే డిమాండ్ పెరగడానికి కారణమని అంటున్నాయి. ఐటీసీ, హిమాలయ డ్రగ్ కంపెనీ, పతంజలి వంటి కంపెనీలు డిమాండ్‌ను తట్టుకోవడానికి ఇప్పటికే ప్రొడక్షన్పెంచినట్లు వెల్లడించాయి. రెండు, మూడు నెలల కిందటి దాకా హ్యాండ్ శానిటైజర్లు, డిజ్ ఇన్ఫెక్టెంట్స్కి డిమాండ్ ఇంత ఎక్కువగా లేదని కంపెనీలు చెప్పాయి. డిమాండ్ ఊపందుకోవడంతో ఇప్పుడు ప్రొడక్షన్‌ను దానికి తగినట్లుగా పెంచుతున్నట్లు పేర్కొంటున్నాయి. హైజీన్ పోర్ట్‌ఫోలియోకు కొన్ని ప్రాంతాలలో డిమాండ్సడెన్గా పెరుగుతున్నట్లు ఐటీసీ డివిజినల్ సీఈఓ (పర్సనల్ కేర్) సమీర్ శత్పథి చెప్పారు. రెండు నెలల కిందటే ప్రొడక్షన్ ప్లాన్ చేశామని, ఇంత డిమాండ్‌ని ఊహించలేదని చెబుతూ, కానీ ప్రొడక్షన్, సప్లయ్‌లపై ఇప్పుడు దృష్టి పెడుతున్నామని హిమాలయ డ్రగ్ కంపెనీ బిజినెస్ డైరెక్టర్ రాజేష్ కృష్ణమూర్తి వెల్లడించారు. సెకండ్ వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవరూ ఊహించలేదని పతంజలి పేర్కొంది.