కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
  • వెల్పుగొండలో 42.6 డిగ్రీలు నమోదు 
     

కామారెడ్డి , వెలుగు:  కామారెడ్డి జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.   గురువారం జిల్లాలోని చాలా ఏరియాల్లో   40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  పాల్వంచ మండలం వెల్పుగొండలో  42.6 డిగ్రీలు,   డొంగ్లిలో 42.5,  మాచాపూర్​లో 42.4,  గాంధారిలో 42,   బిచ్​కుందలో 41.9,  తాడ్వాయి, బోమ్మదేవునిపల్లిలో  41.6 డిగ్రీల చొప్పున, హాసన్​పల్లిలో 41,  మెనూర్​, దోమకొండలో 40.9 డిగ్రీల చొప్పున, నాగిరెడ్డిపేట, లింగంపేట, సర్వాపూర్​ల్లో 40.6 డిగ్రీల చొప్పున,  మగ్ధంపూర్​లో40.5,  రామారెడ్డి, పిట్లంల్లో 4.4, పెద్దకొడప్​గల్​లో 4.2, భిక్కనూరు, జుక్కల్​లో 40.1 డిగ్రీలు,  కామారెడ్డి, పాతరాజంపేటల్లో  39.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ​