
సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా ‘సర్కారు నౌకరి’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాతగా గంగనమోని శేఖర్ డైరెక్షన్ చేస్తున్నాడు. భావనా వళపండల్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. గురువారం ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేసి మరింత క్యూరియాసిటీని పెంచారు.
‘సంకురాతిరి పండగల్లే.. సంతోషాలు తెచ్చేటోడే.. ఎవరేటే.. పండగల్లే వచ్చాడే.. సంబురాలు తెచ్చాడే.. సర్కారు నౌకరోడే’ అంటూ సాగే పాటను సునీత, హారిక నారాయణ్, సాహితి చాగంటి కలిసి పాడారు. సాకేత్ కొమండూరి ట్యూన్ చేయగా, చిత్ర దర్శకుడు గంగనమోని శేఖర్ లిరిక్స్ రాశాడు.