
న్యూఢిల్లీ : ఫిన్‌టెక్ సంస్థ ఇన్‌క్రెడ్ కొత్త, ప్రస్తుత పెట్టుబడిదారుల నుంచి తాజాగా 60 మిలియన్ డాలర్లను సేకరించి యునికార్న్ స్టార్టప్‌గా ఎదిగింది. కొత్తగా మూలధనం రాక వల్ల ఇన్‌క్రెడ్ విలువ 1.04 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఈ సంవత్సరం యునికార్న్ హోదా పొందిన రెండవ కంపెనీగా అవతరించింది. సిరీస్ డీ రౌండ్‌కు ఎంఈఎంజీ రంజన్ పాయ్ నాయకత్వం వహించారు.
ఆయన 9 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టారు. ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రవి పిళ్లై, డాయిష్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గ్లోబల్ కో–-హెడ్ రామ్ నాయక్ వరుసగా 5.4 మిలియన్ డాలర్లు, 1.2 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. నిధుల సమీకరణలో అనేక మంది అల్ట్రా-హై-నెట్ వర్త్ వ్యక్తులు, ఫ్యామిలీ ఆఫీసులు, వరేనియం క్యాపిటల్ అడ్వైజర్స్, సత్వ గ్రూప్ వంటి సంస్థాగత పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు. ఈ డబ్బుతో బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేస్తామని, వ్యాపారాన్ని విస్తరిస్తామని ఇన్‌క్రెడ్ సీఈఓ భూపిందర్ సింగ్ చెప్పారు. తాము కన్జూమర్, స్టూడెంట్, ఎంఎస్ఎంఈ లోన్లు ఇస్తామని చెప్పారు.