ఇన్‌‌‌‌క్రెడ్ మనీ నుంచి ఎఫ్​డీలు

ఇన్‌‌‌‌క్రెడ్ మనీ నుంచి ఎఫ్​డీలు

న్యూఢిల్లీ: తమ యాప్​ద్వారా ఇక నుంచి ఫిక్స్‌‌‌‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌‌‌‌డీలు)ను అందిస్తామని ఇన్‌‌‌‌క్రెడ్ మనీ తెలిపింది.  ఈ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లో అనేక రకాల ఎఫ్‌‌‌‌డీలను పొందవచ్చు. గత ఏడాది మార్చి నాటికి నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో ఎఫ్​డీలలో జనం రూ.108 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు.

ఎఫ్​డీ వడ్డీ రేట్లు 2021,  2022లో దాదాపు 5.5శాతానికి పడిపోయినప్పటికీ, వీటికి డిమాండ్​ తగ్గలేదు. ఇన్‌‌‌‌క్రెడ్ మనీ తన ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌‌‌‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలవి (ఎన్​బీఎఫ్​సీలు) సహా ఆర్​బీఐ- షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌‌‌‌ల ఎఫ్​డీలను అందిస్తోంది.    వడ్డీరేట్లు 9.01 శాతం వరకు ఉంటాయని తెలిపింది.