మైదానంలో కలిసిపోయిన ఓవల్ పిచ్.. భారత్ గెలవడం కష్టమేనా?   

మైదానంలో కలిసిపోయిన ఓవల్ పిచ్.. భారత్ గెలవడం కష్టమేనా?   

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సిద్ధం చేసిన పిచ్ చూస్తుంటే.. భారత జట్టు గెలవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చేలా ఉంది. ముఖ్యంగా బ్యాటర్లు చెమటలు చిందించక తప్పదు. పిచ్‌పై ఆ పచ్చిక చూడగానే.. పేసర్ల కోసం తయారుచేశారని ఈజీగా చెప్పొచ్చు. స్వింగ్ బౌలింగ్‌కు కూడా మంచి సహకారం లభించొచ్చు. అదే జరిగితే కమిన్స్, స్టార్క్, బోలాండ్ లతో కూడిన పేస్ త్రయాన్ని ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు అతి పెద్ద సవాల్. 

ఇండియా వద్ద కూడా మంచి పేసర్లే ఉన్నా.. ఆసీస్ బ్యాట్లర్లకు పేస్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఎక్కువ ఉండటం వల్ల వారు అంత ఇబ్బంది పడకపోవచ్చు. అందులోనూ బుమ్రా లోటు భారత్‌కు అతి పెద్ద దెబ్బ. ఈ మ్యాచులో భారత్.. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తోంది. మరి ఈ నిర్ణయం భారత్‌కు కలిసొస్తుందా! అంటే కష్టమే అని నిపుణులు చెప్తున్నారు. ఒక ఆల్‌రౌండర్ సహా నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని సూచిస్తున్నారు.

ఆశలన్నీ పుజారా, రహానేపైనే.. 

ఈ పిచ్‌పై భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడం కంటే ముందు క్రీజులో కుదురుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గిల్ - రోహిత్ జోడి మంచి శుభారంభం అందించగలిగితే.. ఆ తరువాత వచ్చే బ్యాట్లరు దానిని కొనసాగించగలరు. గిల్, విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చేదే అయినా... భారీ స్కోర్లు చేయాలంటే ఆశలన్నీ పుజారా, రహానేపైనే. ఈ పిచ్‌పై ఆస్ట్రేలియా పేస్ త్రయాన్ని ఎదుర్కోవాలంటే.. అది వీరిద్దరి వల్లే సాధ్యమవుతుంది. ఏదేమైనా 'వరి నారు' లాంటి పిచ్ తయారుచేసిన ఓవల్ మైదాన సిబ్బందికి ధన్యవాదాలు చెపుదాం..