సెకండ్ వన్డే: భారత్ బ్యాటింగ్

సెకండ్ వన్డే: భారత్ బ్యాటింగ్

పుణె: మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా శుక్రవారం పుణె వేదికగా జరిగే రెండో వన్డేలో ఇంగ్లండ్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.  టీమిండియా ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. మొదటి వన్డేలో భుజం గాయంతో సిరీస్‌ నుంచి వైదొలిగిన శ్రెయాస్‌ అయ్యర్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టు  ఈ వన్డే కోసం రెండు మార్పులు చేసింది. కెప్టెన్‌ మోర్గాన్‌ గాయంతో మిగిలిన రెండు వన్డేలకు దూరమవడంతో అతని స్థానంలో జాస్‌ బట్లర్‌ కెప్టెన్ గా బాధ్యతలు వహిస్తున్నాడు. ఫస్ట్ వన్డేలో గాయపడిన సామ్‌ బిల్లింగ్స్‌ స్థానంలో లివింగ్‌ స్టోన్‌ ఫైనల్ టీమ్ లోకి వచ్చాడు.

ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌లతో అదరగొడుతున్న టీమిండియా మరో పోరాటానికి సిద్ధమైంది. సిరీస్‌‌ సమం చేయడాన్ని టార్గెట్‌‌గా పెట్టుకున్న ఇంగ్లండ్‌‌ను గాయాలు వేధిస్తున్నాయి. ఓపెనర్లు జేసన్‌‌ రాయ్‌‌, బెయిర్‌‌ స్టో  టచ్‌‌లో ఉండటం ఇంగ్లండ్‌‌కు ప్లస్‌‌ పాయింట్. కానీ స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ బ్యాటింగ్‌‌ ఫెయిల్యూర్‌‌ టీమ్‌‌ను బాగా దెబ్బతీస్తోంది.  బట్లర్‌‌, అలీ, సామ్‌‌ కరన్‌‌తో మిడిలార్డర్‌‌ చూడటానికి బలంగానే కనిపిస్తున్నా.. సమష్టిగా  రాణించలేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇంగ్లండ్‌‌ భారీ స్కోరు చేయాలన్నా, పెద్ద టార్గెట్‌‌ను ఛేజ్‌‌ చెయ్యాలన్నా వీళ్లంతా రాణిస్తేనే సాధ్యమవుతుంది. ఒకదాని తర్వాత మరొకటి ఇంగ్లండ్‌‌పై టెస్ట్‌‌, టీ20 సిరీస్‌‌లను గెలిచిన టీమిండియా మరో భారీ విక్టరీపై కన్నేసింది..! మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌ను సొంతం చేసుకునేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచింది..! టాప్‌‌ క్లాస్‌‌ పెర్ఫామెన్స్‌‌తో చెలరేగుతున్న కోహ్లీసేన..  సిరీస్‌‌ విక్టరీ టార్గెట్‌‌గా సెకండ్‌‌ వన్డేకు సిద్ధమైంది..! ఓవరాల్‌‌గా టూర్‌‌ మొత్తంలో వైట్‌‌వాష్‌‌కు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్‌‌ గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ భావిస్తోంది..! స్టార్‌‌ ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. సమయోచితంగా రాణించడంలో విఫలమవు తున్న ఇంగ్లండ్‌‌ బృందం..  లెక్క సరిచేసి సిరీస్‌‌లో నిలు స్తుందా..! లేక టీమిండియాకు మూడో సిరీస్‌‌ కూడా అప్పగిస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది..!

టీమ్స్ వివరాలు:

భారత్‌: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్ శర్మ, ధావన్, పంత్‌, కేఎల్‌ రాహుల్, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, శార్దుల్, చహల్, ప్రసిధ్‌.
ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), రాయ్, బెయిర్‌ స్టో, మలాన్, స్టోక్స్, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, స్యామ్‌ కరన్, టామ్‌ కరన్, రషీద్, టోప్లీ.