IND vs ENG: 500 టెస్టు వికెట్లు.. దిగ్గజాల సరసన రవిచంద్రన్ అశ్విన్ 

IND vs ENG: 500 టెస్టు వికెట్లు.. దిగ్గజాల సరసన రవిచంద్రన్ అశ్విన్ 

భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 500 టెస్టు వికెట్ల క్లబ్‍లో చేరాడు. 15 పరుగుల వద్ద జాక్ క్రాలీని అవుట్ చేయడంతో అశ్విన్.. ఈ మైలురాయిని సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్ గా నిలిచాడు. భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత 500 టెస్టు వికెట్లు తీసిన రెండో భారతీయుడు.. అశ్విన్.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

  • ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) - 800 వికెట్లు
  • షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) - 708 వికెట్లు
  • జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) - 695* వికెట్లు
  • అనిల్ కుంబ్లే (భారత్) - 619 వికెట్లు
  • స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) - 604 వికెట్లు
  • గ్లెన్ మెక్‌గ్రాత్ - 563 వికెట్లు
  • కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) - 519 వికెట్లు
  • నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా) - 517* వికెట్లు
  • రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 500* వికెట్లు