IND vs NZ: ఇండియా vs న్యూజిలాండ్ తొలి సెమీ ఫైనల్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

IND vs NZ: ఇండియా vs న్యూజిలాండ్ తొలి సెమీ ఫైనల్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇక మీదట ఓ లెక్క. వరల్డ్ కప్ టోర్నీలో అసలు పోరు రేపటి(నవంబర్ 15) నుంచి మొదలుకానుంది. గెలిచిన జట్టు అడుగు ముందుకేస్తే.. ఓడిన జట్టు ఇంటికి పయనం కావాల్సిందే. ఇదే విషయం మన జట్టుకూ వర్తిస్తుంది. 

వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు రాబోవు 24 గంటలు అగ్ని పరీక్ష వంటిది. నాకౌట్ పోరులో రోహిత్ సేన న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 15న ముంబైలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఈ తరుణంలో సమీఫైనల్ మ్యాచ్‌ల టైమ్ షెడ్యూల్ ఎప్పుడు? ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ చూడాలి అనేది తెలుసుకుందాం. 

మధ్యాహ్నం 2 గంటలకు.. 

గత మ్యాచ్‍ల మాదిరే ఈ  మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, ఆన్‌లైన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు. హాట్‌స్టార్ మొబైల్ యాప్ లో అయితే ఫ్రీగా మ్యాచ్ చూసే వీలుంది. 

తుది జట్లు(అంచనా)

ఈ  మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగవచ్చు.
 
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్.