IND vs NZ: ఒక్క ఇన్నింగ్స్.. సచిన్ మూడు రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ

IND vs NZ: ఒక్క ఇన్నింగ్స్.. సచిన్ మూడు రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ పోరులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో శతకం బాదిన కోహ్లీ.. ఈ  ఒక్క ఇన్నింగ్స్‌తో భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మూడు రికార్డులు బద్దలుకొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు, ఒక వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు, ఒక వరల్డ్‌ కప్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా మూడు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. 

వన్డేల్లో 50 సెంచరీలు

న్యూజిలాండ్‌పై శతకం బాదిన కోహ్లీ(100 నాటౌట్) వన్డే కెరీర్ లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా సచిన్( వన్డేల్లో 49 సెంచరీలు) రికార్డును దాటేశాడు.

ఒక వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు 

20 ఏళ్ల కిందట 2003 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ 673 పరుగులతో ఒక వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును తన పేరిట లిఖించుకోగా.. కోహ్లీ ఆ రికార్డును అధిగమించాడు. విరాట్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించాడు.   

ఎనిమిది సార్లు 50+ స్కోర్లు

గత మ్యాచ్ వరకూ ఒక వరల్డ్‌ కప్‌లో ఏడుసార్లు 50+ స్కోర్లు నమోదుచేసిన రికార్డు సచిన్‌ (7), షకిబ్ అల్ హసన్‌ (7) పేరిట ఉండేది. ఈ  ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఆ రికార్డునూ బద్దలుకొట్టాడు. ఇలా పరుగుల యంత్రం రన్ మెషిన్ ఒక్క ఇన్నింగ్స్ తో సచిన్ పేరిట ఉన్న మూడు రికార్డులు అధిగమించాడు.