ఇండియా vs పాకిస్తాన్: ఆదిపురుష్ పాట‌తో హోరెత్తిన పల్లెకెలే స్టేడియం.. వీడియో

ఇండియా vs పాకిస్తాన్: ఆదిపురుష్ పాట‌తో హోరెత్తిన పల్లెకెలే స్టేడియం.. వీడియో

ఆసియా కప్ 2023లో భాగంగా ఇండియా - పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొద‌ట టాస్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 266 పరుగులు చేయగా.. పాక్‌ బ్యాటర్లు అసలు మైదానంలోకే రానివ్వకుండానే వర్షం ముంచెత్తింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు ఫలితం తేలకుండానే ముగిసింది. కాగా, ఈ మ్యాచ్‍లో స్టేడియం అంతటా ఆదిపురుష్ సినిమాలోని రామ్ సియా రామ్ పాట మార్మోగింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. 

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అక్కడి నుండి టీమిండియా ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను ఇషాన్ కిషాన్ (87), హార్దిక్ పాండ్యా (82) చేపట్టారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరు బౌండరీ కొట్టినప్పుడల్లా ఆదిపురుష్ సినిమాలోని రామ్ సియా రామ్ పాటను డీజే నిర్వాహకులు ప్లే చేశారు. బంతి బౌండరీ వెళ్లిన ప్రతిసారి రామ్ సియా రామ్ పాట రావడంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. అభిమానులు కూడా ఈ పాటను బాగా ఎంజాయ్ చేశారు.

మరోసారి ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్

కాగా, ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా(87), ఇషాన్ కిషన్(82) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు తీసుకోగా.. హారిస్ రౌఫ్ 3, నసీం షా 3 వికెట్లు తీసుకున్నారు. ఈ ఇరు జట్లు సెప్టెంబర్ 10న మరోసారి తలపడే అవకాశం ఉంది.