కోహ్లీ నా మనసు గాయపరిచాడు: విరాట్ కోసం పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు

కోహ్లీ నా మనసు గాయపరిచాడు: విరాట్ కోసం పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురుంచి అందరికీ విదితమే.మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు అతని సొంతం. కోహ్లీ ఆడుతుంటే ప్రత్యక్షంగా చూడాలని స్టేడియానికి వచ్చేవారు కొందరైతే.. అతన్ని చూస్తే చాలు అని పరితపించేవారు మరికొందరు. ఇదిగో ఈ కథనంలో మనం చెప్పుకోబోయే యువతి.. రెండో కోవకు చెందింది. కోహ్లీని చూడటం కోసం దేశమే దాటొచ్చింది.

ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం ఇండియా- పాకిస్తాన్ తలపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో దోబూచులాడిన వర్షం.. పాక్‌ బ్యాటర్లను అసలు మైదానంలోకే రానివ్వకుండా ముంచెత్తింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు ఫలితం తేలకుండానే ముగిసింది. 

పాకిస్తాన్ To శ్రీలంక

పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళా అభిమాని కోహ్లీని చూడటం కోసం తండ్రితో కలిసి ఈ మ్యాచ్‌కు హాజరైంది. ప్రత్యక్షంగా తనను చూడటానికే శ్రీలంకకు వచ్చానన్న సదరు యువతి.. కోహ్లీ సెంచరీ చేస్తాడని ఆశించానని తెలిపింది. కానీ, 4 పరుగులకే ఔటై తన హృదయాన్ని గాయపరచడని పేర్కొంది.

"నేను కోహ్లీ కోసమే వచ్చాను.. అతని నుండి సెంచరీ ఆశించాను. అది జరగలేదు.. నా గుండె బద్దలయ్యింది.. " అని నిరాశగా చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.