Yes ఇది నిజం : ఇండియా, సౌతాఫ్రియా మ్యాచ్ వల్ల గుర్రానికి గుండెపోటు..

Yes ఇది నిజం : ఇండియా, సౌతాఫ్రియా మ్యాచ్ వల్ల గుర్రానికి గుండెపోటు..

అది ఈడెన్ గార్డేన్ లో ఆదివారం (నవంబర్ 5) సాయంత్రం..దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలు తున్నారు.. మ్యాచ్ నిర్వాహకులు భారత్ గెలిచిన సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చింది. పెద్ద పెద్ద శబ్దాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది...ఇండియా గెలిచింది ..అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.. అంతా బాగానే ఉంది.. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఓ విషాదకర, దిగ్భ్రాంతికర ఘటన కూడా చోటు చేసుకుంది. ఈడెన్ గార్డెన్ ముందు డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసు డిపార్ట్ మెంట్ కు చెందిన రెండు గుర్రాలు అక్కడికక్కడే కుప్పకూలాయి.. కారణం ఏంటంటే అవి గుండె పోటుతో చనిపోయాయి.. వివరాల్లోకి వెళితే.. 

కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం (నవంబర్ 5) భారత్ , సౌతాఫ్రికా జట్ట మధ్య జగిరిన వరల్డ్ కప్ మ్యాచ్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుంది.  కోల్ కతా పోలీస్ మౌంటెడ్ డివిజన్ లో భారత్ విజయోత్సవ సంబరాలు విషాదాన్ని నింపాయి. బాణసంచా  కాల్చడంతో ఆ శబ్దాలకు ఓగుర్రం మరణించింది.

దక్షిణాఫ్రికా పై భారత్ విజయం సాధించిన తర్వాత  రాత్రి 8.30 గంట ల ప్రాంతంలో సంబరాలు నిర్వహించారు ఈడెన్ గార్డెన్ నిర్వాహకులు.  ఇందులో భాగంగా బాణసంచా పేల్చారు. అయితే పోలీస్ మౌంటెడ్ డివిజన్ లోని రెండు గుర్రాలు వాయిస్ ఆఫ్ రీజన్, మేర్ తో సహ గుర్రాలు బెదరిపోయి అదుపులేకు పరుగెత్తడంతో గందరగోళం నెలకొంది. అయితే వాయిస్ ఆఫ్ రీజన్ అనే గుర్రం కొన్ని గంటల తర్వాత గుండెపోటుతో మరణించింది.

గందరగోళం మధ్య ఇద్దరు మౌంటెడ్ పోలీసులు కూడా గాయపడ్డారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ బాణసంచా కాల్చడానికి కోల్ కతా పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన తర్వాత ఈడెన్ గార్డెన్ లో జరిగే రెండు మ్యాచ్ లకు బాణసంచాను నిషేధించారు. ఇటీవల ఢిల్లీ , ముంబై నగరాల్లో కూడా కాలుష్య పెరుగుతున్న కారణంగా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ ల సమయంలో బాణసంచా కాల్చడం నిషేధించారు.