IND vs SL: లంకేయుల స్పిన్‌కి తేలిపోయిన భారత బ్యాటర్లు.. స్వల్ప లక్ష్యం

IND vs SL: లంకేయుల స్పిన్‌కి తేలిపోయిన భారత బ్యాటర్లు.. స్వల్ప లక్ష్యం

పాకిస్తాన్‌పై దంచి కొట్టిన భార‌త టాపార్డ‌ర్ శ్రీ‌లంక స్పిన్ ధాటికి విలవిలాలాడిపోయారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించ‌డంతో లంకేయుల మాయాజాలానికి పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. 49.1 ఓవర్లలో 213 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది.20 ఎల్లా కుర్ర బౌలర్ దునిత్ వెల్ల‌లాగే 5 వికెట్ల‌తో అద‌ర‌గొట్టగా.. పార్ట్ టైమ్ స్పిన్నర్ చరిత అసలంక 4 వికెట్లతో చెలరేగాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు మంచి ఆరంభం లభించింది. రోహిత్ శ‌ర్మ‌(53)- శుభ్‌మ‌న్ గిల్(19) జోడి తొలి వికెట్ కు 11 ఓవర్లలో 80 పరుగులు జోడించారు. అక్కడినుండి మ్యాచ్ తలకిందలైంది. బాల్ అందుకున్న దునిత్ వెల్ల‌లాగే తొలి బంతికే గిల్‌ను బౌల్డ్ చేశారు. ఆ త‌ర్వాత వ‌రుస ఓవ‌ర్ల‌లో రోహిత్ (53), కోహ్లీ(3) కూడా ఔట్ అవ్వడంతో స్కోర్ బోర్డు మందగించింది.

ఆపై కాసేపు కేఎల్ రాహుల్(39)- ఇషాన్ కిష‌న్(33) జోడికుదురుకున్నా.. రాహుల్ వెనుదిరిగాక భారత్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా(5), ర‌వీంద్ర జ‌డేజా(4), జ‌స్ప్రీత్ బుమ్రా(5) కుల్దీప్ యాద‌వ్‌(0).. ఇలా ఒకరివెంట మరొకరు పెవిలియన్ చేరారు. లంక బౌలర్లలో దునిత్ వెల్ల‌లాగే 5 వికెట్లు తీసుకోగా..  అస‌లంక నాలుగు వికెట్లు పడగొట్టాడు.