సెహ్వాగ్‌ రికార్డ్ బద్దలు.. టాప్ -5లోకి ఎంటరైన కోహ్లీ

సెహ్వాగ్‌ రికార్డ్ బద్దలు.. టాప్ -5లోకి  ఎంటరైన కోహ్లీ

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురానియి అందుకున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 76(182 బంతుల్లో) పరుగులు చేసిన కోహ్లి.. టెస్టుల్లో టాప్ 5 భారత బ్యాట‌ర్ల జాబితాలోకి చేరారు. ఈ మ్యాచ్ కు ముందు టెస్టుల్లో 8503 పరుగులతో సెహ్వాగ్  ఐదో స్థానంలో ఉండగా.. కోహ్లీ ఆ మైలురాయిని దాటేశారు. 

ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్‌(15921), రాహుల్ ద్రావిడ్‌(13265), సునిల్ గ‌వాస్క‌ర్‌(10122), వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌(8781) కోహ్లీ కంటే ముందువరుసలో ఉన్నారు.

కాగా, వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి టెస్టులోనే 171 పరుగులతో భారీ స్కోరుకు పునాది వేసిన యశస్వి జైస్వాల్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అందుకున్నారు.