టీమిండియాకు ఎదురుదెబ్బ..స్వదేశానికి సిరాజ్

టీమిండియాకు ఎదురుదెబ్బ..స్వదేశానికి సిరాజ్

స్టిండీస్తో జరగబోతున్న వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వర్క్ లోడ్ కారణంగానే విండీస్తో జరిగే వన్డే సిరీస్ నుంచి మహ్మద్ సిరాజ్ను బీసీసీఐ తప్పించింది. ఈ ఏడాది ఆసియా కప్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ లు ఉండటంతో సిరాజ్కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిన బీసీసీఐ..అతన్ని స్వదేశానికి రావాల్సిందిగా ఆదేశించింది. 

జులై 27వ తేదీ నుంచి టీమిండియా ఆతిథ్య జట్టుతో వన్డే సిరీస్ ఆడుతోంది. అయితే టెస్టులు ముగిసిన నేపథ్యంలో టెస్టు జట్టు సభ్యులు రవిచంద్రన్ అశ్విన్,  అజింక్యా రహానే, కెఎస్‌ భరత్, నవదీప్ సైనీలతో సిరాజ్ భారత్కు  పయనమయ్యాడు. అయితే బుమ్రా, మహ్మద్ షమీ గైర్హాజరుతో సిరాజ్ విండీస్ తో జరిగిన రెండు టెస్టుల్లో ఆడాడు. ఈ సిరీస్లో  సిరాజ్‌ అదరగొట్టాడు. తొలి టెస్టులు కేవలం 2 వికెట్లే పడగొట్టిన సిరాజ్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు దక్కించకుని ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. 

ముఖేష్ లేదా.. అర్ష్‌దీప్‌ సింగ్‌..

వెస్టిండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు సిరాజ్ దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో ముఖేష్ కుమార్ లేదా  అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. ముఖేష్ కుమార్ ఇప్పటికే టెస్టు సిరీస్ లో ఆడాడు. అతడు వన్డే సిరీస్ కు ప్రకటించిన జట్టులో కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తుది జట్టులో అతనికి స్థానం దక్కే ఛాన్సుంది. అయితే అర్షదీప్ సింగ్ మాత్రం టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం అర్ష్‌దీప్‌ దీప్ సింగ్ వెస్టిండీస్ లోనే ఉన్నాడు. ఈ క్రమంలో సిరాజ్ ప్లేస్ లో వన్డే జట్టులో అర్షదీప్ సింగ్ కు చాన్సివ్వాలని కెప్టెన్  రోహిత్‌ శర్మ, కోచ్ ద్రవిడ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.