ఇవాళ ఆసియా కప్ తొలి సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇవాళ ఆసియా కప్ తొలి సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఉ. 8.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో

సిల్హెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన ఇండియా విమెన్ప్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరుకు రెడీ అయ్యింది. గురువారం జరిగే తొలి సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా.. థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది. బలం, బలగం, ప్రకారం చూసినా, ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లెక్కలోకి తీసుకున్నా.. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్నది. దీనికితోడు లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించడం కూడా ఇండియాకు కలిసొచ్చే అంశం. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలాన్ని పరీక్షించుకోవాలని ఇండియా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేని ప్లేయర్లకు తగినంత టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి గాడిలో పడేలా చేయాలని ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తోంది.

ఆరు లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకుగాను మూడింటిలోనే ఆడిన హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. భారీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఎదురుచూస్తోంది. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభు నవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరే, హేమలతలో ఒకర్ని ఫినిషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దాలనుకుంటోంది. అయితే ఈ ఇద్దరూ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రయం దీప్తి శర్మ, స్నేహ రాణా, రాజేశ్వరి గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణిస్తుండటం జట్టుకు శుభసూచకం. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షెఫాలీ, స్మృతి మంధాన, జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడం కలిసొచ్చే అంశం. ఇక ఇండియా చేతిలో ఓడినప్పటికీ అదృష్టం కలిసొచ్చిన థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలిసారి సెమీస్​ చేరుకుంది. నన్నపట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంచరోయెంకై, నత్తకాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైవాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపైనే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారం పడనుంది. ఈ ముగ్గురూ నిలబడితే మంచి టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్దేశించే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. కానీ ఇండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు ఈ త్రయం ఎంత మేరకు నిలుస్తారో చూడాలి.