దేశ ప్రజల్లో కొత్త శక్తిని నింపాలి: ఎర్రకోటపై జెండా ఎగరేసిన మోడీ

దేశ ప్రజల్లో కొత్త శక్తిని నింపాలి: ఎర్రకోటపై జెండా ఎగరేసిన మోడీ

న్యూఢిల్లీ: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ ఘనంగా షురూ అయింది. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఎర్రకోటకు చేరుకున్నారు. త్రివిధ దళాల సైనికులు గార్డ్‌ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. తర్వాత జెండా ఎగురవేసి, జెండా వందనం చేశారు. జాతీయ గీతం ఆలపించాక ఎయిర్‌‌ ఫోర్స్ హెలికాప్టర్‌‌ పూల వర్షం కురిపించింది.

https://twitter.com/ANI/status/1426726797450776579

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయాన్ని ప్రధాని మోడీ ట్వీట్‌ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘మీ అందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం దేశ ప్రజల్లో కొత్త శక్తి, చైతన్యం నింపాలి. జై హింద్!” అంటూ ఆయన ట్వీట్ చేశారు.