2023–24 లో రెన్యూవబుల్ ఎనర్జీ 18 గిగావాట్లు అప్‌‌‌‌

2023–24 లో రెన్యూవబుల్ ఎనర్జీ 18 గిగావాట్లు అప్‌‌‌‌
  • మొత్తం 190 గిగావాట్లకు

న్యూఢిల్లీ: దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ (కరెంట్‌‌‌‌)  ఉత్పత్తి పెరుగుతోంది. 2023–24 లో  అదనంగా 18.48 గిగావాట్ల కెపాసిటీ యాడ్ అయ్యింది.  ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో యాడ్ అయిన 15.27  గిగావాట్లతో పోలిస్తే 21 శాతం ఎక్కువ. 2030 నాటికి  రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 500 గిగావాట్లకు చేరుకోవాలంటే వచ్చే ఆరేళ్లలో ఏడాదికి 50 గిగావాట్ల కెపాసిటీ యాడ్ అవ్వాల్సి ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం, ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో  రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 143.64 గిగావాట్లుగా ఉంది.  

ఇందులో 47 గిగావాట్ల  హైడ్రోపవర్‌‌‌‌‌‌‌‌ కెపాసిటీని కలపలేదు. పెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌‌‌‌లను కూడా కలుపుకుంటే దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 190 గిగావాట్లుగా ఉంది.  కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌లో మరో 103 గిగావాట్లు ఉన్నాయి. మొత్తం 290 గిగావాట్ల కెపాసిటీ రెడీగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. మరో 72 గిగావాట్ల కోసం  బిడ్స్ వచ్చాయని  పేర్కొంది.  500 గిగావాట్ల టార్గెట్‌‌‌‌ను అనుకున్నదాని కంటే ముందే చేరుతామని అంచనా వేసింది.