ఢిల్లీలో జూన్ 1న ఇండియా కూటమి పార్టీల మీటింగ్

ఢిల్లీలో జూన్ 1న ఇండియా కూటమి పార్టీల మీటింగ్

లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఏడు దశల పోలింగ్ ముగిన తర్వాత జూన్ 1న ఇండియా కూటమి బ్లాక్ సమావేశం కానుంది.బీజేపీ పార్టీని గద్దే దించాలనే లక్ష్యంగా దాదాపు పది, పదిహేను పార్టీలు కూటమిగా ఏర్పడి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ పార్టీలు అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యాణా, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి ఈ కూటమి పార్టీలు గట్టి పోటీనే ఇచ్చాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించాయి.

జరిగిన ఎన్నికలు, తర్వాత జూన్ 4న వచ్చే ఫలితాలపై సమీక్ష చేయడానికి జూన్1 ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇండియా కూటమి సోమవారం తెలిపింది. ఈ మిటింగ్ లో రిజల్ట్స్ అంచనా, పోలింగ్ తీరుపై కూటమి నేతలు మాట్లాడుకోనున్నారు.