SIR ను నిరసిస్తూ..ఇండియా కూటమి ఎంపీల ఆందోళన

SIR ను నిరసిస్తూ..ఇండియా కూటమి ఎంపీల ఆందోళన

ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటులో నిరసన చేపట్టారు.బీహార్ లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్(SIR) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో లక్షలాదిమంది ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని, ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు ,వలస కార్మికులు తమ ఓటు హక్కు కోల్పోతున్నారని విపక్షాలు వాదిస్తున్నాయి. SIR పేరుతో ప్రజాస్వామ్యంపై బీజేపీ వార్ చేస్తుందని, వెంటనే SIR ప్రక్రియను నిలిపివేయాలని విపక్ష ఎంపీల నినాదాలు చేశారు. 

పార్లమెంటు ప్రాంగణంలో డిమాండ్ డిస్కషన్, నాట్ డిలీషన్, స్టాప్ ఎస్ఐఆర్ వంటి నినాదాలతో కూడిన భారీ బ్యానర్లు, ప్లకార్డులను ఎంపీలు ప్రదర్శించారు.పార్లమెంటులోని మకర ద్వార్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, కనిమొళి వంటి కీలక నేతలు పాల్గొన్నారు. విపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

SIR పై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరపాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. దీనిపై చర్చ జరిపి ఓటర్ల హక్కులను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్చకు అంగీకరించలేదు. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని..అది చేపట్టిన ప్రక్రియపై పార్లమెంటులో చర్చ అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెబుతున్నారు.