
- ఫెస్టివల్ సీజన్‌పైనే కంపెనీల ఆశలు
- పెరిగిన టాటా అమ్మకాలు
- పర్వాలేదనిపించిన ఎగుమతులు
న్యూఢిల్లీ: ఎకానమీ పుంజుకున్నప్పటికీ గత నెల బండ్ల హోల్‌సేల్ అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సేల్స్ తొమ్మిది శాతమే పెరిగాయి. టూవీలర్ అమ్మకాలు బాగా తగ్గాయి. ఎగుమతులు ఫర్వాలేదనిపించాయి. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు మాత్రం బాగు న్నాయి. అయితే పండగలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అమ్మకాలు ఈ నెల బాగుంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. మారుతీ సుజుకి గత నెల అమ్మకాలు 57 శాతం తగ్గి 63,111 యూనిట్లుగా రికార్డు అయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ 147,912 యూనిట్లను అమ్మింది. దేశీ అమ్మకాలు సెప్టెంబర్ 2021 లో 66,415 యూనిట్లుగా కాగా, గత సెప్టెంబరులో 150,040 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ అమ్మకాలు34.2శాతం తగ్గి 33,087 యూనిట్లకు పడిపోయాయి. ఈ కంపెనీ సెప్టెంబర్ 2020 లో 50,313 యూనిట్లు అమ్మింది. ఎగుమతులు 34.3శాతం పెరిగి 12,704 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటార్స్ గత నెలలో 24,652 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ అమ్మింది. 2020 సెప్టెంబర్‌లో అమ్మిన 20,891 యూనిట్లతో పోలిస్తే 18 శాతం గ్రోత్ కనిపించింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 250 శాతం పెరిగాయి. గత సెప్టెంబర్ లో 308 యూనిట్లను అమ్మగా, గత నెలలో వీటి సంఖ్య 1,078 యూనిట్లకు పెరిగింది.
–దక్షిణ కొరియా ఆటో కంపెనీ కియా అమ్మకాలు 22.67 శాతం తగ్గాయి. 2020 సెప్టెంబర్ లో కంపెనీ మొత్తం 18,676 యూనిట్లను డీలర్లకు పంపింది. గత నెలలో డీలర్లకు 4,454 యూనిట్ల సొనెట్, 9,583 యూనిట్ల సెల్టోస్, 404 యూనిట్ల కార్నివాల్ వెహికల్స్ అమ్మింది.
– టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీ అమ్మకాలలో 14 శాతం గ్రోత్ కనిపించింది. గత నెల 9,284 యూనిట్లను అమ్మగా, 2020 సెప్టెంబరు నెలలో తన డీలర్‌షిప్‌లకు 8,116 యూనిట్లను పంపింది.
టూవీలర్/సీవీల అమ్మకాలు ఇలా..
గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో బజాజ్ ఆటో మొత్తం దేశీ అమ్మకాలు 16 శాతం పడిపోయి 1,92,348 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఈ కంపెనీ గత ఏడాది సెప్టెంబర్‌లో మొత్తం 2,28,731 యూనిట్లను అమ్మింది. ఎగుమతులు తొమ్మిది శాతం తగ్గి 4,02,021 యూనిట్లకు పడిపోయాయి. కంపెనీ గత నెల 1,73,945 టూవీలర్లను అమ్మింది. 2020 సెప్టెంబరులో 2,19,500 టూవీలర్లను డీలర్లకు పంపించింది. కమర్షియల్ వెహికల్స్ ఏకంగా 99 శాతం పెరిగి 18,403 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఎస్కార్ట్స్ ట్రాక్టర్ అమ్మకాలలో 25.6 శాతం తగ్గుదల కనిపించింది. గత నెల కేవలం 8,816 బండ్లు అమ్ముడయ్యాయి. 2020 సెప్టెంబరులో 11,851 సేల్ చేసింది. టీవీఎస్ మోటార్స్ టూవీలర్స్ అమ్మకాలు ఆరు శాతం పెరిగాయి. అమ్మకాలు 3,13,332 యూనిట్ల నుంచి 3,32,511 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు 20 శాతం పెరిగి 102,259 యూనిట్లకు ఎగిశాయి. త్రీవీలర్ల అమ్మకాలు రెండు శాతమే పెరిగి 14,645 యూనిట్లుగా రికార్డయ్యాయని టీవీఎస్ తెలిపింది.