హాకీ వరల్డ్ కప్లో భారత్ బోణి

హాకీ వరల్డ్ కప్లో భారత్ బోణి

హాకీ వరల్డ్ కప్లో భారత్ బోణి కొట్టింది. స్పెయిన్పై 2-0 స్కోరు తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా తరపున  వైస్‌ కెప్టెన్‌ అమిత్‌ రోహిదాస్‌ తొలి గోల్‌  సాధించగా.. హార్దిక్‌ సింగ్ రెండో గోల్‌  కొట్టాడు. 
రోహిదాస్ అమిత్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

గ్రూప్ D లో భాగంగా రూర్కెలా లోని బిర్సాముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో మ్యాచ్లో  స్పెయిన్పై  భారత్ పూర్తిగా ఆధిపత్యాన్ని చూపింది. ఆట మొదలైనప్పటి నుంచే భారత్ .. బంతిని ఎక్కువ సేపు తన నియంత్రణలోనే ఉంచుకునే ప్రయత్నం చేసింది.  తొలి క్వార్టర్ లో లభించిన పెనాల్టీ కార్నర్ను రోహిదాస్ (12వ నిమిషంలో)  గోల్ గా మలిచి  భారత్కు శుభారంభాన్నిచ్చాడు.  దీంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

 ఇక సెకండ్ క్వార్టర్లో హార్దిక్ ఫీల్డ్  (26వ నిమిషంలో)  గోల్ సాధించాడు.  దీంతో భారత్ ఆధిక్యంలో 2-0కు పెరిగింది. చివరి రెండు క్వార్టర్స్లో గోల్స్ సేందుకు స్పెయిన్ విఫలయత్నం చేసినా..భారత డిఫెన్స్ అద్భుతంగా  అడ్డుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీమిండియా మూడు పాయింట్లు దక్కించుకుంది. భారత తన తదుపరి మ్యాచ్ ఈ నెల 15న ఇంగ్లండ్తో ఆడనుంది.