తొలి వన్డేలో భారత్ ఘన విజయం

తొలి వన్డేలో భారత్ ఘన విజయం

టీమిండియా,వెస్టిండీస మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విక్టరీ కొట్టింది. దీంతో మూడు వన్డేలో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి రోహిత్ సేన దూసుకెళ్లింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి వెస్టిండీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించి 6 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. 177 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా కేవలం 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 1000వ వన్డేలో ఘన విజయం సాధించింది. 

రోహిత్ శర్మ 60, ఇషాన్ కిషన్ 28 పరుగులతో కీలక పార్టనర్‌షిప్‌తో చివర్లో సూర్యకుమార్ 34, దీపక్ హుడా 26 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించి విజయాన్ని అందించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్లింది. విరాట్ 8, పంత్ 11 పరుగులు చేశారు.

ఇవి కూడా చదవండి:

భారత్‌లో సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్ టీకా