భారత్‌లో సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్ టీకా

భారత్‌లో సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్ టీకా

భారతదేశంలో సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు DCGI అనుమతి లభించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా  అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఇది దేశంలో కోవిడ్‌కు చెందిన 9వ వ్యాక్సిన్ అని ఆయన ట్వీట్ చేశారు. 

రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారత్‌లో పంపిణీ కోసం అనుమతి పొందిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 2వ వారం నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగిల్ డోస్ ధరను ఖరారు చేస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తుండగా.. దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడం, వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సినేషన్ అవసరం ఉండటం, కొవాగ్జిన్, కొవీషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం సరిపోకపోవడంతో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి అత్యవసర వినియోగం కింద కేంద్రం ఏప్రిల్ 12నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా స్పుత్నిక్ లైట్ కోవిడ్ వ్యాక్సిన్‌కు కూడా డ్రగ్ కంట్రోలర్ అనుమతి కల్పించింది. 

ఇవి కూడా చదవండి: 

లతా మంగేష్కర్‌‌ మృతిపై పాక్‌ ప్రధాని సంతాపం

రేపు హైదరాబాద్కు వైఎస్ జగన్