లతా మంగేష్కర్‌‌ మృతిపై పాక్‌ ప్రధాని సంతాపం

లతా మంగేష్కర్‌‌ మృతిపై పాక్‌ ప్రధాని సంతాపం

లెజండరీ సింగర్, భారత గాన కోకిల లతా మంగేష్కర్ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె అమృతమయ గాత్రం మూగబోయింది. మన దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ‘భారత రత్నాన్ని’ కరోనా బలి తీసుకుంది. ఆమె మరణ వార్త తెలిసి దేశంలో ప్రతి హృదయం విషాదంలో మునిగిపోయింది. ఆమె గాత్రం ముగబోయిందే కానీ, పాట రూపంలో మన మధ్య ఆమె ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారని ప్రధాని మోడీ తన సంతాప ప్రకటనలో చెప్పారు. లతాజీ మరణం తన హృదయాన్ని కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ప్రముఖ రాజకీయ వేత్తలు, సినిమా సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ లతా మంగేష్కర్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. అయితే లతా మంగేష్కర్ మృతిపై ఇతర దేశాధినేతలు సైతం సంతాపం తెలిపారు.

పాక్, నేపాల్ ప్రధానుల సంతాపం

లతా మంగేష్కర్ మృతి పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ మరణంతో మన ఉపఖండం ప్రపంచంలోనే గొప్ప సింగర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందిన గాయనిని కోల్పోయిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమె మధుర గానం విని ఆనందించే వాళ్లు ఎందరో ఉన్నారంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ట్వీట్ చేశారు.

లత గాత్రంలో మధురమైన నేపాలీ పాటలు

లత మృతి పట్ల నేపాల్ ప్రెసిడెంట్ విద్యా దేవి భండారీ, ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ విచారం వ్యక్తం చేశారు. ప్రముఖ భారత సింగర్ లతా మంగేష్కర్ మరణం తనను ఎంతో బాధించిందని విద్యా దేవి అన్నారు. ఆమె తన మధురమైన గాత్రంతో నేపాలీ ఎన్నో నేపాలీ పాటలకు అద్భుతంగా పాడారని, అసామాన్య ప్రతిభా సంపన్నురాలైన ఆమెకు  నివాళి అర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

భారత లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణించారన్న వార్త తనను ఎంతో బాధించిందని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ అన్నారు. పలు నేపాలీ పాటలు కూడా పాడిన ఆమెకు నివాళి అర్పిస్తున్నానని అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారాయన.

మరిన్ని వార్తల కోసం..

గాన కోకిలకు జాతీయ జెండా కప్పి సైనికుల సెల్యూట్

ఇండియాలో కొత్త ట్రెండ్.. ఇక ఆ కంపెనీలో వారం వారం జీతం

లతా మంగేష్కర్ చివరిగా పాడిన పాట ఇదే