ఎన్డీయేకు షాక్​ అసెంబ్లీ బైపోల్స్​​.. ఇండియా కూటమి విజయకేతనం

ఎన్డీయేకు షాక్​ అసెంబ్లీ బైపోల్స్​​.. ఇండియా కూటమి విజయకేతనం

 

  • దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నికలు
  • 10 సీట్లతో సత్తాచాటిన ఇండియా కూటమి 
  • 2 సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఓ చోట ఇండిపెండెంట్​ గెలుపు

న్యూఢిల్లీ:  సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికల సమరంలో విపక్ష ఇండియా కూటమి జయకేతనం ఎగురవేసింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మాత్రం చతికిలపడింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్​ జరగగా, ప్రతిపక్ష ఇండియా కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 2 సీట్లకే పరిమితమైంది. మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పంజాబ్​(1), హిమాచల్​ ప్రదేశ్​ (3), ఉత్తరాఖండ్​ (2), బెంగాల్(4), మధ్యప్రదేశ్​ (1), బిహార్​ (1), తమిళనాడు (1) రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఈ నెల 10 న బై ఎలక్షన్​ జరిగింది. శనివారం ఎలక్షన్​ కమిషన్​ కౌంటింగ్​ నిర్వహించి, ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. ఉప ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడు రాష్ట్రాల్లో ఎన్డీయే సర్కారు పవర్​లో ఉంది.

బెంగాల్​లో టీఎంసీ క్లీన్​స్వీప్​

పశ్చిమ బెంగాల్​లో 4 సీట్లకు బై ఎలక్షన్​ జరగ్గా.. తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ(టీఎంసీ) క్లీన్​స్వీప్​ చేసింది. రాయ్​గంజ్​లో బీజేపీ అభ్యర్థి మానస్​కుమార్​పై  క్రిష్ణ కల్యాణి, రాణాఘాట్​లో బీజేపీ అభ్యర్థి మనోజ్​ కుమార్​పై ముకుత్​ నామి అధికారి, బాగ్దాలో బీజేపీ​ అభ్యర్థి వినయ్ ​కుమార్​ విశ్వాస్​పై మధుపర్ణ ఠాకూర్​, మాణిక్​ తలాలో బీజేపీ అభ్యర్థి కల్యాణ్​ చౌబేపై సుప్తి పాండే గెలుపొందారు.  

పంజాబ్​లో ఆప్​దే హవా

పంజాబ్‌లోని జలంధర్‌ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా.. ఇక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్‌ అంగురల్​పై 37,325 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లో మంగలౌర్‌, బద్రీనాథ్‌ స్థానాలను కాంగ్రెస్‌ దక్కించుకుంది. బద్రీనాథ్​లో బీజేపీకి చెందిన రాజేంద్ర భండారిపై లక్పత్​సింగ్​ బుటోలా, మంగలౌర్​లో బీజేపీ అభ్యర్థి కర్తార్​సింగ్​ భాదానాపై ఖాజీ నిజాముద్దీన్​ విజయం సాధించారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో పీఎంకే అభ్యర్థి అన్బుమణి సీపై  డీఎంకే అభ్యర్థి అన్నియుర్‌ శివ గెలుపొందారు. మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడ్​లో బీజేపీ నేత కమలేశ్‌ షా విజయం సాధించారు. బిహార్‌లోని రూపౌలి స్థానంలో జేడీయూ అభ్యర్థి కళాదర్​ ప్రసాద్​ మండల్​పై స్వతంత్ర అభ్యర్థి శంక్‌ సింగ్‌ గెలుపొందారు.

హిమాచల్​లో సీఎం సుఖ్వీందర్ భార్య గెలుపు 

హిమాచల్​ప్రదేశ్​లో 3 అసెంబ్లీ స్థానాలకు బైపోల్​ జరగ్గా.. దేహ్రాలో ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సుఖు భార్య, కాంగ్రెస్ క్యాండిడేట్​ కమలేశ్​ ఠాకూర్​ విజయం సాధించారు.  నాలాగఢ్​ స్థానంలో కాంగ్రెస్​ అభ్యర్థి హర్దీప్ ​సింగ్​ బవా విజయం సాధించగా, హమీర్​పూర్​ సీటును బీజేపీ గెల్చుకున్నది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అశీష్​ శర్మ విజయం సాధించారు.  ఈ సందర్భంగా సీఎం సుఖ్వీందర్​ సింగ్​ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు పన్నుతున్న వారికి హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తగిన సమాధానం చెప్పారని అన్నారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికల సమరంలో ఎన్డీయేకు ప్రతిపక్ష ఇండియా కూటమి షాకిచ్చింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్​ జరగగా, ప్రతిపక్ష ఇండియా కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 2 సీట్లకే పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఉప ఎన్నిక జరిగిన 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడు రాష్ట్రాల్లో ఎన్డీయే సర్కారు పవర్​లో ఉంది. పశ్చిమబెంగాల్​లో 4 సీట్లకు బై ఎలక్షన్​ జరగ్గా.. తృణమూల్ ​కాంగ్రెస్ క్లీన్​స్వీప్​ చేసింది. పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జలంధర్​లో  ఆప్ ​అభ్యర్థి గెలుపొందారు. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగలౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కించుకుంది.