
ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియాకు 132 పరుగుల ఆధిక్యం లభించింది. 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టును జానీ బెయిర్ స్టో (106) ఆదుకున్నాడు. అతనికి కెప్టెన్ బెన్‌స్టోక్స్ (25), సామ్ బిల్లింగ్స్ (36) పరుగులతో సహకరించారు. చివర్లో మాటీ పాట్స్ (19) వేగంగా పరుగులు చేశాడు. అటు భారత బౌలర్లలలో సిరాజ్ 4, బుమ్రా 3, షమీ2 వికెట్లు తీయగా, శార్దుల్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగుులు చేసింది.