ఐక్యరాజ్య సమితిలో పాక్ కు భారత్ కౌంటర్

ఐక్యరాజ్య సమితిలో పాక్ కు భారత్ కౌంటర్

స్విట్జర్లాండ్ : కశ్మీర్ లో ఎలాంటి ఆకృత్యాలు జరగడంలేదని ప్రపంచానికి మరోసారి స్పష్టం చేసింది భారత్. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉన్న ఐక్యరాజ్య సమితి రెండో ప్రధాన కార్యాలయంలో వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది భారత్. విదేశాంగ శాఖ తూర్పు వ్యవహారాల  కార్యదర్శి విజయ్ ఠాకూర్ నేతృత్వంలో పాకిస్తాన్ లో భారత మాజీ అంబాసిడర్ అజయ్ బిసారియా ఈ సమావేశం నిర్వహించారు. కశ్మీర్ లో మానవ హక్కుల  ఉల్లంఘన జరుగుతోందన్న పాకిస్తాన్ ఆరోపణలకు కౌంటర్ గా ఈ సమావేశం ఏర్పాటు చేసిన భారత్… పాక్ ఆరోపణలను ఖండించింది. కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని వివరించారు భారత ప్రతినిధులు.

జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు బలూచ్, పస్తూన్ ఉద్యమకారులు ఫ్లెక్సీలు, పోస్టర్లు  ప్రదర్శించారు. సేవ్ బలూచ్… మంజూర్ పస్తూన్ అంటూ నినాదాలు రాసిన పోస్టర్లను ఏర్పాటు చేశారు. పస్తూన్, బలూచ్  ఏరియాల్లో పాకిస్తాన్ మానవ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.