దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే

 దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతుండడంతో దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిస్తున్న గణాంకాల ప్రకారం గత 20 రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా తగ్గిపోతూ వస్తున్నాయి. తాజాగా దేశంలో కొత్త కేసుల సంఖ్య 20వేల దిగువన నమోదైంది. 
గడచిన 24 గంటల్లో 11 లక్షల 87 వేల 766మందికి పరీక్షలు చేయగా  19 వేల 968 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ కొత్త కేసులను అంతకుముందు రోజుతో పోల్చితే 2,300 కేసులు తగ్గుదల నమోదయ్యింది. నిన్నటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 28 లక్షల 22 వేల 473 కు చేరింది. అలాగే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల 24 వేల 187 కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.68 శాతానికి పడిపోయి 
మరో వైపు కరోనాతో నిన్న దేశ వ్యాప్తంగా 325 మంది మరణించారు. వీటితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 5 లక్షల 11 వేల 903 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 48 వేల 847 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 175 కోట్ల 37 లక్షల 22 వేల 697 వాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 30 లక్షల 81 వేల 336 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు.