దేశంలో భారీగా తగ్గిపోయిన కరోనా.. తాజా కేసులు ఎన్నంటే

దేశంలో భారీగా తగ్గిపోయిన కరోనా.. తాజా కేసులు ఎన్నంటే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోతున్నాయి. కేవలం నామమాత్రంగా కేసులు నమోదు అవుతుండడం ఊరట కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్త కేసులు 1270 మాత్రమే నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 4 లక్షల 32 వేల 389 మందికి పరీక్షలు చేయగా.. 1270 మందికి మాత్రమే కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే మరణాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. మొన్న మొత్తం 149 మరణాలు నమోదు కాగా.. గడచిన 24 గంటల్లో కేవలం 31 మరణాలు మాత్రమే నమోదయ్యాయి.

దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5.21 లక్షలకు చేరింది. మరో వైపు దేశ వ్యాప్తంగా 1567 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15,859కి పడిపోయింది. ఇంకో వైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 4 లక్షల 20వేల 842 మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో ఇప్పటి వరకు వేసిన వ్యాక్సిన్ల సంఖ్య 183 కోట్లకు చేరుకుంది. 

 

ఇవి కూడా చదవండి

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధగా ఉంది

అంగరంగ వైభవంగా ఆస్కార్ ప్రదానోత్సవం

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో