భారతీయులను ‘కైలాసం’ రానివ్వను

భారతీయులను ‘కైలాసం’ రానివ్వను

న్యూఢిల్లీ: కైలాసం పేరుతో సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని ప్రకటించుకున్న నిత్యానంద స్వామి తాజాగా మరో అనౌన్స్‌‌మెంట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తన కైలాసంలో ఎంట్రీకి పలు ఆంక్షలు పెట్టాడు. ఇండియా, బ్రెజిల్, మలేసియాతోపాటు యూరోపియన్​ యూనియన్​ దేశాల నుంచి కైలాసానికి ప్రయాణాల మీద బ్యాన్​ విధిస్తున్నట్లు ప్రకటించాడు. కాగా, లైంగిక వేధింపుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిత్యానంద.. 2019లో దేశం విడిచి పరారైన సంగతి తెలిసిందే. ఈక్వెడార్ దేశానికి దగ్గర్లోని ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి, కైలాసం పేరుతో దేశాన్ని నిర్మించుకున్నట్లు ప్రకటించాడు. ‘రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ కైలాస’ ఏర్పాటు చేసి సొంత కరెన్సీని కూడా రూపొందించడం గమనార్హం