Rahul Sipligunj Sangeet: కాబోయే భార్యకు సింగర్ రాహుల్ బిగ్ సర్‌ప్రైజ్‌.. నా హృదయం నిండిపోయిందని హరిణ్య పోస్ట్

Rahul Sipligunj Sangeet: కాబోయే భార్యకు సింగర్ రాహుల్ బిగ్ సర్‌ప్రైజ్‌.. నా హృదయం నిండిపోయిందని హరిణ్య పోస్ట్

టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లిసందడి షురూ అయింది. రాహుల్-హరిణ్యల వివాహం గురువారం (2025 నవంబర్ 27న) గ్రాండ్గా జరగనుంది. ఈ సందర్భంగా తాజాగా సంగీత్‌ వేడుక వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ ద్వారా రాహుల్ తనకు కాబోయే భార్య హారణ్యకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

హారణ్యకు ఫేవరేట్ క్రికెటర్ అయిన టీమ్‌ ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను ఆహ్వానించి రాహుల్ ఖుషి చేశారు. ఈ వేడుకకు వచ్చిన చాహల్‌.. కాబోయే కొత్త దంపతులు రాహుల్-హరిణ్యలతో ఫోటోలు దిగి సందడి చేశారు. ఈ క్రమంలో హారణ్య ఎనలేని సంతోషంతో ఫీల్ అవుతూ ఆశ్చర్యపోయింది. లేటెస్ట్గా ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.

‘‘ మై డియర్ రాహుల్.. ఇంత పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. టీమ్‌ ఇండియా స్పిన్నర్‌ చాహల్‌కు నేను పెద్ద వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్న. నా హృదయం నిండిపోయింది. ఈ క్షణాలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మమ్మల్ని బ్లేస్ చేయడానికి వచ్చిన చాహల్‌కు అతిపెద్ద థ్యాంక్స్’’ అని హరిణ్య పోస్ట్‌ ద్వారా తన అభిప్రాయం పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ తరుణంలోనే అభిమానులు అడ్వాన్స్ శుభాకాంక్షలు అందిస్తున్నారు.

ఇకపోతే.. 2025 ఆగస్ట్ 17న హైదరాబాద్లో రాహుల్ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తెనే ఈ హరిణ్యా రెడ్డి. ఆమెకి ఇంస్టాగ్రామ్లో 38.9 Kమంది ఫాలోవర్స్ ఉన్నారు. మరో రెండు రోజుల్లో జరుగనున్న రాహుల్-హరిణ్యల వివాహనికి సినీ, రాజకీయ ప్రముఖులు అటెండ్ అవ్వనున్నారు.