2014-18: ఆయుధాల దిగుమతి తగ్గించిన భారత్

2014-18: ఆయుధాల దిగుమతి తగ్గించిన భారత్

రష్యా నుంచి ఇండియాకు ఆయుధాల దిగుమతి తగ్గుతోంది. 2009–13, 2014–18 మధ్య దిగుమతులు 42 శాతం తగ్గాయి. 2009–13లో ఇండియాకు దిగుమతి అయిన ఆయుధాల్లో 76 శాతం రష్యా సరఫరా చేయగా అది 2014–18 మధ్య 58 శాతానికి తగ్గింది. స్టాక్‌‌‌‌హోమ్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ పీస్‌‌‌‌ రీసర్చ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్ యూట్‌‌‌‌ విడుదల చేసిన ‘ట్రెండ్స్‌‌‌‌ ఇన్‌‌‌‌ ఇంటర్నే షనల్‌‌‌‌ ఆర్మ్స్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్స్‌‌‌‌ 2018’ నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు ప్రధాని మోడీ చేసిన ప్రయత్నాల వల్ల 2009–13తో పోలిస్తే 2014–18 మధ్య 24 శాతం వరకు వాటి దిగుమతి తగ్గిందని నివేదిక పేర్కొంది. విదేశీ కంపెనీలు ఆయుధాల సరఫరాలో ఆలస్యం చేయడమూ దిగుమతి తగ్గడానికి కారణమని వివరించింది. రష్యా నుంచి దిగుమతులు తగ్గుతున్నా, ఇండియాకు దిగుమతి అవుతున్న ఆయుధాల్లో రష్యావే ఎక్కువని పేర్కొంది. ప్రపంచంలో ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియానే ముందుందనీ చెప్పింది. 2014–18 మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమారు 9.5 శాతం దిగుమతి చేసుకుందని తెలిపింది. 2014–18 మధ్య ఇజ్రాయెల్‌‌‌‌, అమెరికా, ఫ్రాన్స్‌‌‌‌ నుంచి ఎగుమతి పెరిగిందని నివేదిక వెల్లడించింది.

పాకిస్థాన్‌‌‌‌ కూడా ఆయుధాల దిగుమతిని బాగానే తగ్గించిందని, 2009–13 దిగుమతులతో పోలిస్తే 2014-18 మధ్య దిగుమతులు 39 శాతం తగ్గాయని నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికా నుంచి పాక్‌‌‌‌కు ఆయుధాల
ఎగుమతి 81 శాతం తగ్గిం దని పేర్కొంది. అలాగే పాక్‌‌‌‌కు మిలిటరీ సాయం అందించేందుకు యూఎస్‌‌‌‌ విముఖత వ్యక్తం చేసిన విషయాన్నీ నివేదిక గుర్తు చేసింది. ప్రపంచంలో 2014–18 మధ్య ఎక్కువగా ఆయుధాలు ఎగుమతి చేసిన దేశాలు వరుసగా అమెరికా, రష్యా , ఫ్రాన్స్‌‌‌‌, జర్మనీ, చైనా. ఎక్కువగా దిగుమతి చేసుకున్నవి సౌదీ అరేబియా, ఇండియా, ఈజిప్టు, ఆస్ట్రేలియా, అల్జీరియా .