IND vs AUS: మన చేతుల్లో లేదు బాస్..ఏం చేయలేం: రెండేళ్లుగా టాస్ గెలవని టీమిండియా

IND vs AUS: మన చేతుల్లో లేదు బాస్..ఏం చేయలేం: రెండేళ్లుగా టాస్ గెలవని టీమిండియా

టీమిండియాకు బ్యాడ్ లక్ కొనసాగుతోంది. రెండేళ్లుగా వైట్ బాల్ క్రికెట్ లో తిరుగులేకుండా దూసుకెళ్తున్న భారత జట్టు టాస్ విషయంలో మాత్రం నిరాశ తప్పడం లేదు. కెప్టెన్ లు మారినా మన జట్టు టాస్ గెలవడంలో విఫలమవుతున్నారు. వరుసగా ఐదు.. పది కాదు ఏకంగా 18 వన్డేల్లో టాస్ ఓడిపోయారు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో శనివారం (అక్టోబర్ 25) ప్రారంభమైన మూడో వన్డేలోనూ ఇండియా టాస్ ఓడిపోయింది. గిల్ కెప్టెన్ గా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో టాస్ ఓడిన ఇండియా చివరి వన్డేలోనూ టాస్ ఓడింది. జట్టు ఎంత పటిష్టంగా ఉన్నపటికీ టాస్ ఓడిపోవడం కొన్నిసార్లు పరాజయానికి కారణమవుతుంది.    

2023 వన్డే వరల్డ్ కప్ లో టాస్ ఓడిపోయిన ఇండియా.. ఈ రెండేళ్లలో వన్డే క్రికెట్ లో టాస్ గెలవడంలో విఫలమవుతూ వస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫిలో రోహిత్ అన్ని మ్యాచ్ ల్లో టాస్ ఓడిపోతే.. ఆ బ్యాడ్ లక్ ను గిల్ కొనసాగిస్తూ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో అన్ని మ్యాచ్ ల్లో టాస్ ఓడిపోయాడు. తొలి రెండు వన్డేల్లో టీమిండియా ఓడిపోవడానికి టాస్ కూడా ఒక కారణం. పిచ్ మీద బౌన్స్ ఉపయోగించుకొని ఆస్ట్రేలియా పేసర్లు చెలరేగి ఆరంభంలోనే మ్యాచ్ ను ఇండియా నుంచి దూరం చేశాడు. కేవలం వన్డేలోనే కాదు టెస్ట్, టీ20 ఫార్మాట్ లోనూ ఇండియా టాస్ గెలవలేకపోతుంది. 

ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం (అక్టోబర్ 25) మూడో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ వచ్చారు. మరోవైపు ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. బార్ట్ లెట్ స్థానంలో ఎల్లిస్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. 

భారత్ (ప్లేయింగ్ XI): 

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్